- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లమలలో పట్టపగలే చుక్కలు
దిశ, అచ్చంపేట: రాష్ట్రంలో కరోనా ప్రభావం రోజురోజుకు తాండవిస్తున్న ఈ తరుణంలో నల్లమల ప్రాంతంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ముందస్తు సూచనలు చేస్తున్నప్పటికీ రక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రజలు కాస్తా మొండివైఖరిగా ఉండడంతో కరోనా కేసులు గ్రామాలలో పెరుగుతున్నాయి. ఇటీవల అచ్చంపేట పట్టణంలో ఒకే రోజు ఎనిమిది మందికి పాజిటివ్ అని తేలడంతో వారితో ప్రైమరీ కాంటాక్టు ఉన్న వారికి కూడా పాజిటివ్ నివేదికలు వచ్చినట్లు వైద్య సిబ్బంది వెల్లడిస్తున్నాయి. మాస్కులు, వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలని అవగాహన కలిగిస్తున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయడంతో ఒకరి నుండి మరొకరికి చాలా సులువుగా కరోనా సోకుతుందని చెప్పవచ్చు. రాష్ట్ర రాజధానిలో కరోనా కేసులు వందల సంఖ్యలో పెరుగుతున్న దరిమిలా పట్టణాలను వదిలి పల్లెలకు చేరుకుంటున్న వారిలో పాజిటివ్ లేక నెగటివ్ ఉన్నదని నిరూపించుకోవడంలో వారికి వారు మోసం చేసుకోవడంతోపాటు ఇతరులకు కూడా ఇబ్బందికర పరిస్థితులను తలెత్తేలా చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, అచ్చంపేట పట్టణంలో కేసుల ప్రభావం పెరుగుతుండడంతో పై మండల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో అచ్చంపేట పట్టణ కేంద్రానికి వచ్చే వినియోగదారులకు ముందస్తుగా రానున్న నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు నిత్యావసర సరుకుల వ్యాపారం లాక్ డౌన్ బుధవారం నుండి వచ్చే ఆదివారం వరకు కొనసాగించుటకు వ్యాపారస్తులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిత్యావసర సరకుల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. టమాటా కిలో 40 రూపాయలు నుండి 80 రూపాయలకు, పచ్చిమిర్చి కేజీ 60 రూపాయలకు ఎగబాకింది. వినియోగదారులు లాక్డౌన్ పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లులు వేసేలా వ్యాపారస్తులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని వినియోగదారులు విమర్శిస్తున్నారు. కావున అధికారులు ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.