భూములు ఇవ్వడమే వారు చేసిన నేరమా

by srinivas |
భూములు ఇవ్వడమే వారు చేసిన నేరమా
X

దిశ, వెబ్ డెస్క్: దళితులను అరెస్టు చేసి 7రోజులు అవుతున్నా సీఎం ఇంత వరకు స్పందించ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. గతంలో కూడా చాలా మంది రైతులను అరెస్టు చేశారని ఆయన అన్నారు. కానీ కృష్ణాయ పాలెంలో దళితులకు మాత్రం ఎందుకు బేడీలు వేశారని డీజీపీని అడిగానని ఆయన చెప్పారు. సీఎం పేషీ నుంచి ఫోన్ వచ్చినందుకే దళితుల చేతికి పోలీసులు బేడీలు వేశారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడమే వారు చేసిన నేరమా అని ప్రశ్నించారు. కాగా ఈ ఘటనలో అమాయకులైన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని ఆయన తెలిపారు. ఉదయం 9గంటలకు ఘటన జరిగితే రాత్రి 8గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

Advertisement

Next Story