- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వాళ్లిద్దరిపై కేసులున్నాయి.. అతనికి రాష్ట్రానికి సంబంధం లేదు’
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభ ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులపై టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థి వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామిరెడ్డి, మోపిదేవికి నేర చరిత్ర ఉందని అన్నారు. మోపిదేవి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తి అని చెప్పారు. ఇక అయోధ్య రామిరెడ్డిపై దేశ వ్యాప్తంగా 10 కేసులు ఉన్నాయని అన్నారు. అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వానీ మన రాష్ట్రానికి సంబంధం లేదని ఆయన విమర్శించారు. అలాంటి వారికి ఎందుకు టికెట్లిచ్చారో తనకు అర్ధం కాలేదని చెప్పారు. రాజ్యసభకు ఇలాంటి వ్యక్తులను కాకుండా మంచివాళ్లను పంపించాలని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆత్మప్రభోదానుసారం ఓటింగ్ చేసి ఉంటారని భావిస్తున్నానని చెప్పారు. తనకు ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేదని ఆయన చెప్పారు. బడుగు, బలహీనవర్గాల వాణిని రాజ్యసభలో బలంగా వినిపిస్తానని ఆయన చెప్పారు.