- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యాస్ పొయ్యి మీద వండితే పాత్రలకు మసి ఎందుకు అంటదు..?
దిశ, వెబ్ డెస్క్: చాలామంది ఈ విషయంలో డౌట్ వస్తుంది. ఎందుకంటే కట్టెల పొయ్యిపై వండినప్పుడు పాత్రలకు మసి అంటుతుంది. కానీ, గ్యాస్ పొయ్యి మీద మాత్రం అంటదు. అయితే, పాత్రలకు మసి అంటుకోవడమనే విషయం వంటకు మనం వాడే ఇంధనం రకాన్ని బట్టి ఉంటుంది. కట్టెల పొయ్యిలో వినియోగించేటువంటి వంటచెరకులోని కర్బన పదార్థాలు పూర్తిగా దహనం కాకపోవడంతో మసి రూపంలో పాత్ర అడుగుకు అంటుకుంటాయి. అదే కిరోసిన్ స్టౌ అయితే కొంచెం తక్కువ మసి అంటుకుంటుంది. ఇందుకు కారణం దహనం కాని కర్బన పదార్థాలు కిరోసిన్ లో తక్కువగా ఉంటాయి. ఇక గ్యాస్ విషయానికొస్తే, సిలిండర్ లోని బ్యూటేన్, ప్రోపేన్ లాంటి ద్రవీకృత పెట్రోలియం వాయువు ఆక్సిజన్ లో కలిసి మండినప్పుడు పూర్తిగా దహనమవుతుంది. ఎటువంటి కర్బన అవశేషాలను ఏర్పరచదు. అందుకే గ్యాస్ స్టౌవ్ ను సిమ్ లో ఉంచినా, మంట పూర్తిగా పెంచినా మసి అంటదు.
ఇవి కూడా చదవండి: ఈవినింగ్ సరదాగా స్నాక్స్ తినాలని ఉందా.. ఇది ట్రై చేయండి