పవన్ సరసన వాణి కపూర్ కన్ ఫాం

by Shyam |   ( Updated:2020-02-07 07:53:58.0  )
పవన్ సరసన వాణి కపూర్ కన్ ఫాం
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రాబోతున్న పిరియాడికల్ మూవీ రాబోతోంది. పెత్తందార్లకు ఎదురు నిలిచి సాయుధ పోరాటం చేసిన తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న కథను డైరెక్టర్ ఎంచుకున్నాడని సమాచారం. ఈ సినిమా కోసం పవన్ లుక్స్ కూడా మార్చేశాడని టాక్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా హీరోయిన్ గా ‘కంచె’ ఫేం ప్రగ్యా జైస్వాల్ ను ఓకే చేశారు.

సినిమా కథకు మరో హీరోయిన్ అవసరం ఉండగా… ఆ పనిలో ఉన్న క్రిష్ బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ను సంప్రదించాడట. పవర్ స్టార్ పక్కన ఛాన్స్, మెయిన్ రోల్ కావడంతో ఓకే చెప్పేసిందట. కాగా నేచురల్ స్టార్ నాని సరసన ఆహా కళ్యాణం చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తర్వాత హిందీలో బిజీ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు తెలుగులో పవన్ పక్కన నటించే ఆఫర్ కొట్టేసింది. ఎం.ఎం. కీరవాణి సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా… ఏ.ఎం. రత్నం నిర్మాత.

Advertisement

Next Story