- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంశీకృష్ణ ప్రాణం తీసిన ఫేస్‌బుక్ లవ్ !
దిశ, వెబ్‌డెస్క్: ఫేస్‌బుక్ రిక్వెస్ట్ ఫ్రెండ్‌షిప్‌కు బాటలు వేసింది. చాటింగ్ అభిరుచులను కలిపింది. క్లోజ్‌గా మూవ్ అయ్యారు, మనసిచ్చుకొని బంధం పెంచుకున్నారు. చెప్పలేనంత ఇష్టంతో ప్రేమలో మునిగిపోయారు. రోజులు గడిచాయి, నెలలు దాటాయి. ఆనందంగా ప్రేమలో బాసలు చెప్పుకున్నారు. ఇంతలోనే అభిప్రాయ భేదాలు ఆఖరి మాటలకు దారి తీశాయి. ఫోన్‌లో ఘర్షణ పడి అనరాని మాటలు అనుకున్నారు. ప్రేయసి ఛీ కొట్టడంతో జీవితం ఎందుకనుకున్న ఆ యువకుడు ప్రాణాన్ని తీసుకున్నాడు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
అల్వాల్‌కు చెందిన వంశీకృష్ణ అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం ఫేస్ఋక్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. రోజులు గడిచేకొద్దీ సాన్నిహిత్యం పెరగడంతో ప్రేమికులుగా మారారు. తమ అభిప్రాయాలను మొత్తం ఫేస్ఋక్, వాట్సప్ చాటింగ్‌లో పంచుకుంటూ ప్రేమకు పునాది వేసుకున్నారు. ఇదేక్రమంలో యువతిపై ఉన్న ఇష్టంతో ఆమె ఫొటోను తన బాడీపై వంశీకృష్ణ ముద్రించుకున్నాడు. అప్పుడప్పుడు బయట కలుసుకోవడం సైతం చేస్తున్నారు. కానీ కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో రెండ్రోజుల క్రితం యువతితో ఫోన్‌లో ఘర్షణ పడిన వంశీకృష్ణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
తన ప్రియురాలు తిట్టిన మాటలకు కుంగిపోయిన వంశీకృష్ణ చనిపోవాలని డిసైడ్ అయి ఆదివారం సాయంత్రం అల్వాల్ చేరుకొని రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. అతని వద్ద దొరికిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఓ ప్రైవేట్ కంపెనీలోఉద్యోగం చేస్తున్న వంశీకృష్ణ.. నిన్న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి అల్వాల్‌లో ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.