- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆ జీవో ప్రజల ప్రాణాలను కాపాడుతుంది’
దిశ ఏపీ బ్యూరో: పేదల ఆరోగ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 77 ప్రజల ప్రాణాలు రక్షిస్తుందని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. ఈ జీవోతో కరోనా వైరస్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకి చికిత్స అందించాలని నిర్ణయించడం, ఈ మేరకు ఫీజులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించడం ముదావహమని ఆయన కొనియాడారు.
గతంలో ప్రైవేటు ఆస్పత్రులను కూడా అవసరమైతే వినియోగించుకుంటామంటూ అత్యవసర వైద్య సేవల చట్టాన్ని ప్రయోగించిన ప్రభుత్వం తాజాగా కరోనా రోగులకు ప్రైవేటు ఆస్పత్రులు అందించే సేవలకు ఫీజులు నిర్ణయించి దందాకు పాల్పడకుండా ప్రైవేటు ఆస్పత్రులను కట్టడి చేయడం శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా ఆ ఫీజులను నోటీస్ బోర్డులో విధిగా ఉంచాలని ఆదేశించడం పారదర్శకతను ప్రతిబింబించడమేనని ఆయన స్పష్టం చేశారు.
జీవో 77లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల వివరాల్లోకి వెళ్తే…
* కరోనా వైరస్ సోకినప్పటికీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేని వారికి చికిత్స అందిస్తే రోజుకి 3,250 రూపాయలు ఫీజుగా వసూలు చేయొచ్చని తెలిపింది.
* కరోనా సోకిన రోగిని ఐసీయూలో చేర్పించి వెంటిలేటర్ అవసరం లేకుంటే రోజుకి 5,480 రూపాయలు వసూలు చేయొచ్చు.
* ఐసీయూలో ఉంటూ ఎన్ఐవీ అంటే నాన్ ఇమేజివ్ ఇన్వెస్టిగేషన్ అవసరమైతే 5,980 రూపాయలు వసూలు చేయొచ్చు.
* ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంటే రోజుకి 9,580 రూపాయలు వసూలు చేయాలి.
* ఐసీయూలో ఉంటూ ఆరోగ్యం బాగా క్షీణించిన వారికి వెంటిలేటర్ లేకుండా చికిత్సనందిస్తే రోజుకి 6,280 రూపాయలు వసూలు చేయాలి.
* వెంటిలేటర్ సాయం అవసరమైతే 10,380 రూపాయలు వసూలు చేయాలి.
* ఆరోగ్యం బాగా క్షీణిస్తే కూడా 10,380 రూపాయలు వసూలు చేయాలి.
* ఆరోగ్య శ్రీ సౌకర్యం లేని ఆస్పత్రుల్లో అదనంగా రోజుకి 600 రూపాయలతో పాటు పీపీఈ కిట్లు, వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఫీజులు వేరుగా చెల్లించాలని తెలిపింది.