- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్.. నన్ను అలా పిలవద్దు..! ఫ్యాన్స్‌కు స్టార్ హీరో రిక్వెస్ట్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన ఫ్యాన్స్‌కు ఒక రిక్వెస్ట్ చేశాడు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ అజిత్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపై తనను ‘తలా’ అని పిలవకూడదని.. అభిమానులను వేడుకున్నాడు. మీడియా, అభిమానులతో ఎప్పుడు నేరుగా కలిసి మాట్లాడటానికి ఇష్టపడని ఈ హీరో.. ఈసారి కూడా మేనేజర్ సురేష్ చంద్ర ద్వారా ఈ విషయాన్ని చెప్పించారు. గౌరవనీయులైన మీడియా సభ్యులు, ప్రజానీకం, అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘నన్ను ఇక నుంచి అజిత్, అజిత్ కుమార్ లేదా జస్ట్ ఏకేఎన్ అనే పిలవండి. అంతే తప్ప నా పేరుకు ముందు ‘తలా’ లేదా మరేదైనా ట్యాగ్ యాడ్ చేయొద్దు. మీ అందరూ ఆయురారోగ్యాలతో,, సుఖ:సంతోషాలతో సంతృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రేమతో మీ అజిత్’ అని మేనేజర్ ద్వారా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయించారు.
కాగా తన రిక్వెస్ట్‌కు స్పందించిన ఫ్యాన్స్.. ‘మీ అభ్యర్థనను అంగీకరిస్తున్నాం AK సర్. మేము మీ పేరును ఏకే/అజిత్‌గా మార్చేశాం’ అంటున్నారు. ఇక మాకు మిగిలిన ‘తలా’ ఎంఎస్ ధోనినే అని పోస్టులు పెడుతున్నారు.