- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోలీవుడ్ స్టార్‌తో తలపడుతున్న ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో
దిశ, సినిమా : తలా అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘వాలిమై’. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి ఫిమేల్ లీడ్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ యంగ్ హీరో, ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్ రోల్ చేస్తుండటం విశేషం. తన బర్త్‌డే సందర్భంగా విష్ చేసిన మేకర్స్.. సినిమా నుంచి కార్తికేయ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ విషయానికొస్తే ఒక చేతిలో వాకీ టాకీ, మరోచేతిలో మందు గ్లాసుతో సీరియస్ లుక్‌తో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించాడు. ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో చేసిన విలన్ రోల్‌తో మార్కులు కొట్టేసిన కార్తికేయ.. మరోసారి తనలోని విలనిజాన్ని చూపెట్టేందుకు సిద్ధమయ్యాడు. మూవీని దీపావళికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తుండగా.. ఈ నెలలోనే స్పెషల్ వీడియో ద్వారా డేట్ అనౌన్స్ చేయనున్నారు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్న సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కాగా అజిత్ – కార్తికేయ మధ్య వచ్చే సీన్ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Team #Valimai wishes a very Happy Birthday to talented @ActorKartikeya. Stay blessed always.
#AjithKumar @BoneyKapoor #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @SureshChandraa @DoneChannel1 @SonyMusicSouth#HBDKartikeya #HappyBirthdayKartikeya #Kartikeya pic.twitter.com/c6BaZ0WLFH— BayViewProjectsLLP (@BayViewProjOffl) September 21, 2021