లవర్స్ డే స్పెషల్.. దంపతులకు ఉచితంగా విడాకులు!

by Sujitha Rachapalli |
లవర్స్ డే స్పెషల్.. దంపతులకు ఉచితంగా విడాకులు!
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ విడిపోవాలంటే ఏడేళ్ల తంట. అవును వివాహం రోజుల వ్యవధిలోనే చేసుకోవచ్చు. కానీ విడాకులు కావాలంటే కోర్టుల చుట్టూ ఏండ్ల తరబడి తిరగాల్సిందే. దానికి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఓ సంస్థ మాత్రం లవర్స్ డే సందర్భంగా విడిపోవాలని అనుకుంటున్న దంపతులకు ఫ్రీగా విడాకులు ఇప్పిస్తామని ప్రకటించింది.

కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. కుటుంబ పోషణ కూడా కొన్ని కుటుంబాల్లో కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో విడాకులు తీసుకునే జంటలకు కోర్టు, లాయర్‌కు చెల్లించే ఫీజులు భారంగా మారాయి. దీంతో యూకేకు చెందిన Powers Law Firm in Crossville సంస్థ ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఆ పోటీలో గెలిచిన విజేతలకు ఉచితంగా విడాకులు ఇవ్వనున్నారు. కోర్టు ఖర్చులను పూర్తిగా ఆ సంస్థే భరిస్తుంది. ఈ మేరకు ఫేస్ బుక్‌లో వారు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఎంపిక కావడానికి ఏం చేయాలి..?

భార్యభర్తలు ఇద్దరూ విడిపోవడానికి పూర్తిగా అంగీకారం తెలిపిన వాళ్లే దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకు విడిపోతున్నారో వివరిస్తూ సంస్థకు అధికారిక మెయిల్ చేయాలి. ఫిబ్రవరి 15 నుంచి ఈమెయిల్ చేయాలి. ఫిబ్రవరి 19 కల్లా విన్నర్ ను ఎంపిక చేస్తారు. చట్టపరంగా దంపతులు ఇద్దరూ విడిపోయేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. అనంతరం డైవర్స్ ఫైలింగ్ ప్రక్రియ మొదలుపెడుతారు. పోటీలో పాల్గొనే వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సినవసరం లేదు. డైవర్స్ చేయాలని అనుకున్న వారికి మైనర్ చిన్నారులు ఉన్నట్లైతే..పేరెంట్ ఎడ్యుకేషన్ క్లాసులకు అయ్యే ఖర్చులు తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంటుంది. విడిపోవాలని అనుకున్న వారు లోకల్ ప్రాంతానికి చెందిన వాళ్లు అయి ఉండాలి. ఇతర ప్రాంతానికి చెందిన జంటలు అనర్హులు.

Advertisement

Next Story

Most Viewed