- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వకీల్ సాబ్’ రికార్డ్స్ కా బాప్
రెండేండ్ల విరామం తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బాలీవుడ్‌లో విజయవంతమైన పింక్ సినిమా రీమేక్ ‘‘వకీల్ సాబ్’’తో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తమ హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు పెద్ద పండగలా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేసి రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఉమెన్స్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ నుంచి ఈరోజు ‘మగువా మగువా’ సాంగ్ విడుదలైంది. మహిళల గొప్పతనాన్ని, ప్రత్యేకతను చాటుతూ ఈ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పడు సంచనాలు సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే 1.5 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది. వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాటలో లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయంటూ మహిళలూ, ప్రేక్షకులు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించాడు.. థమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో వచ్చిన పింక్‌కు రీమేక్‌గా వస్తోంది. ఇప్పటికే హింది, తమిళ భాషల్లోనూ ఈ సినిమాను ప్రేక్షకులు చూశారు.. కానీ ఈ సినిమాను పవర్‌స్టార్ ఏ విధంగా చేశారో అని ఎంతో ఆతృతగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పవన్ సినిమాలు మాములుగా ఉన్నా టాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెడతాడు. ఆయనకు తోడు మంచికథ దొరికితే రికార్డ్స్ బ్రేక్ అవ్వడం గొప్ప విషయమేమి కాదు. MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు, బోనికపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
tags : Vakil Saab Movie, First Song, Records, pawan kalyan, ss thaman, dilraju, boni kapur, womens day