- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేరడిగొండలో ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకలు
దిశ, నేరడిగొండ : భారత మాజీ ప్రధాని, భారతరత్న, స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలను నేరడిగొండ మండల కేంద్రంలోని బీజేపీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. మొదటగా బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోఖ్రాన్ అణు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. పాకిస్థాన్‌తో శాంతి కోసం ఢిల్లీ- లాహోర్ మధ్య బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభించి దౌత్య సంబంధాలను పునః ప్రారంభం కావాలని కాంక్షించారని అన్నారు.
అయినా పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోకపోవడంతో కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ను మట్టికరిపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన దూద్ మాంగేతో ఖీర్ దేయింగే, కాశ్మీర్ మాంగేతో చీర్ దేయింగే అనే నినాదం ప్రతీ భారతీయుడిని కదిలించడమే కాకుండా పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించారు. అలాంటి గొప్ప నాయకుడు మన దేశంలో పుట్టడం మన అదృష్టమని, ఆయన ప్రతీ భారతీయుడికి స్ఫూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు సాబ్లే సంతోష్ సింగ్, సోలంకి ప్రశాంత్, ఓబీసీ మండల అధ్యక్షులు చౌహాన్ విజయ్, పట్టణ అధ్యక్షులు రాథోడ్ రాజశేఖర్, కిసాన్ మోర్చ మండల ప్రధాన కార్యదర్శి జాదవ్ భీం రావ్, పాలియాడ్ రమేష్ పాల్గొన్నారు.