వాజేడులో టీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కీలక నేత

by Shyam |
MLA Podem Veeraiah
X

దిశ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ వాజేడు మండల మాజీ అధ్యక్షుడు కాకర్లపూడి విక్రాంత్ భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. వాజేడు మండలంలో మంచి పట్టున్న విక్రాంత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వాజేడు మండలంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మండలంలో టీఆర్ఎస్‌కు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. అంతేగాకుండా.. విక్రాంత్‌కు మండలంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story