సింహం నడుస్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి.. బాడీ షేమింగ్‌‌పై నటి రిప్లై

by Jakkula Samataha |
సింహం నడుస్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి.. బాడీ షేమింగ్‌‌పై నటి రిప్లై
X

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ వాహ్బిజ్ డోరాబ్జీ.. బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై స్పందించింది. తాజాగా సోషల్ మీడియా నందు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్‌లో పాల్గొన్న నటిని ఓ ఫాలోవర్ బాడీ షేమింగ్, బెదిరింపులను ఎలా హ్యాండిల్ చేస్తారో చెప్పాలని కోరాడు. దీనికి సమాధానంగా.. ‘మీరు మీ మీద విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు ఎవరూ మిమ్మల్ని బాధపెట్టలేరు. నేను నన్ను నమ్ముతున్నాను.. ప్రజల అభిప్రాయాన్ని కాదు. ఇతరులు మీమీద ఆధిపత్యం చలాయించే అవకాశం ఇవ్వకండి. వారి మాటలు మీ పట్ల కత్తుల్లా మారి చంపేసేలా చేసే చాన్స్ అందివ్వకండి. సింహం నడుస్తున్నప్పుడు కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రిప్లై ఇచ్చింది. ఇక తనను గోల్డ్ డిగ్గర్, డివార్సీ అని కామెంట్ చేసిన వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ముందు గోల్డ్ డిగ్గర్‌(డబ్బు కోసం మ్యారేజ్ చేసుకునే అమ్మాయి)కు మీనింగ్ తెలుసుకుంటే మంచిదని సూచించింది. తన జీవితంలో అర్థం లేని వ్యక్తుల వల్ల ప్రభావితం కానని, తల్లిదండ్రులే ముఖ్యమని స్పష్టం చేసింది.

కాగా ‘ప్యార్ కీ యహ్ ఏక్ కహానీ’లో తనతో కలిసి నటించిన వివియన్‌ను పెళ్లి చేసుకున్న వాహ్బిజ్.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న తను బరువు పెరిగానని, ఇది టెర్రిబుల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పింది. దీంతో యాక్టింగ్ నుంచి తప్పుకున్నానని, ప్రస్తుతం హెల్త్ మీద కాన్సంట్రేట్ చేశానని తెలిపింది.

Advertisement

Next Story