టీకాలు హాస్పిటల్ అడ్మిట్లను తగ్గిస్తాయి : కేంద్రం

by Shamantha N |
union-minister-of-health-ha
X

న్యూఢిల్లీ: టీకాలు హాస్పిటల్స్‌పై భారాన్ని తగ్గిస్తాయని, వ్యా్క్సిన్ వేసుకున్నవారిలో 75 శాతం నుంచి 80శాతం హాస్పిటలైజేషన్ అవసరాన్ని నివారిస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 8శాతం మందికే ఆక్సిజన్, 6శాతం మందికే ఐసీయూలు అవసరమవుతాయని తెలిపింది. పలు అధ్యయనాలు ఇవే విషయాలను వెల్లడించాయని శుక్రవారం మీడియాకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. థర్డ్ వేవ్‌తో పిల్లలపై అధిక ముప్పు ఉంటుందని చెప్పలేమని, డబ్ల్యూహెచ్‌వో-ఎయిమ్స్ అధ్యయనంలో సీరోప్రివలెన్స్‌ను పరిశీలిస్తే వయోజనులకు, పిల్లలకు పోల్చదగిన స్థాయిలో ఉన్నట్టు తేలిందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed