హెచ్ఐవీ, డెంగ్యూ బాటలోనే.. కొవిడ్ కూడా?

by vinod kumar |
హెచ్ఐవీ, డెంగ్యూ బాటలోనే.. కొవిడ్ కూడా?
X

దిశ, వెబ్‌డెస్క్: హెచ్ఐవీ, డెంగ్యూ వ్యాధుల లాగానే కొవిడ్ 19కి కూడా ఎన్నటికీ వైరస్ కనిపెట్టలేకపోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతానికి 100కి పైగా వాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. వీటిలో ఒకటో రెండో మాత్రమే మానవుల మీద ప్రయోగానికి ఆమోదం పొందాయి. ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నబారో చెప్పినదాని ప్రకారం కొన్ని వైరస్‌లకు ఉన్న మ్యూటేషన్ శక్తి కారణంగా వాటికి ప్రత్యేకించి ఒక వ్యాక్సిన్ కనిపెట్టడం కష్టమని తెలుస్తోంది. అతికష్టం మీద కరోనా కోసం వ్యాక్సిన్ తయారైనా కూడా దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు కూడా ఎక్కువగా ఉండొచ్చని నబారో అభిప్రాయపడ్డారు.

అయితే హెచ్ఐవీ వైరస్ మాదిరిగా కరోనా వైరస్ మ్యూటేషన్ రేట్ చాలా తక్కువగా ఉండటంతో ఇప్పుడు కాకపోయినా మరికొన్నాళ్లకైనా వ్యాక్సిన్ తయారవుతుందని కొంతమంది నిపుణులు ఆశావ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తయారీ చాలా నెమ్మదిగా సాగుతోందని, అలాగని దాని తయారీ మీద నమ్మకం పెట్టుకోవడం కూడా కొద్దిగా కష్టమేనని నబారో అంటున్నారు. ప్రస్తుతానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద ట్రయల్లో 102 వ్యాక్సిన్లు ఉండగా వీటిలో 8 మాత్రమే మానవ ట్రయల్స్ వరకు వచ్చాయి.

Tags – corona, vaccines, WHO, HIV, Dengue, virus, pandemic

Advertisement

Next Story