రేపటి నుంచి గ్రేటర్ పరిధిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్

by Shyam |   ( Updated:2021-06-02 07:29:45.0  )
రేపటి నుంచి గ్రేటర్ పరిధిలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్
X

దిశ, కంటోన్మెంట్ : రవాణా శాఖ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు జూన్ 3వ తేదీ(గురువారం) నుంచి ఉచితంగా కొవిడ్ వాక్సినేషన్ ఇచ్చేందుకు రవాణా శాఖ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 కేంద్రాలను.. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఏర్పాటు చేసిందని సికింద్రాబాద్ ఆర్టీఓ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాక్సినేషన్ కోసం వెళ్లే వారు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని టీకా కేంద్రానికి వెళ్లాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

https://tgtransport.net/TGCFSTONLINE/OnlineTransactions/VaccineRegistrationNew.aspx

టీకా కేంద్రానికి వచ్చే వారు తప్పనిసరిగా తమ వెంట తీసుకు రావాల్సినవి..
1. డ్రైవింగ్ లైసెన్స్
2. ఆధార్ కార్డు
3. ఆర్‌సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) జిరాక్స్ కాపీలు.

Advertisement

Next Story

Most Viewed