లాక్‌డౌన్ ఎత్తివేతపై ఐసీఎంఆర్ కీలక సూచనలు

by Shamantha N |
లాక్‌డౌన్ ఎత్తివేతపై ఐసీఎంఆర్ కీలక సూచనలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా థర్డ్ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ సూచించింది. లాక్‌డౌన్ ఎత్తివేత, సడలింపులపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొవిడ్ నిబంధనలు, తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కొవిడ్ టెస్టుల సామర్థ్యాన్ని పెంచుతూనే.. జిల్లా స్థాయిలో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయడంతో ప్రయోజనం ఉండదని.. లాక్‌డౌన్ సడలింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగానే సడలించడం మేలని బలరామ్ భార్గవ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story