- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాక్సినేషన్ విధానం అహేతుకం.. కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: 45 ఏండ్లు పైబడిన వారికి ఉచిత టీకా, అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న వారికి పెయిడ్ సిస్టమ్ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానం ఏకపక్షమైనదనీ.. అది అహేతుకమనీ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వ్యాక్సినేషన్ సమస్యను ఖచ్చితంగా కీలకమైనదిగా పేర్కొంది. 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారు కొవిడ్ బారిన పడటమే కాకుండా దీర్ఘకాలికంగా ఆస్పత్రుల పాలవ్వడం, కొన్ని సందర్భాల్లో మరణానికి గురవుతున్నట్టు రిపోర్టులు సూచిస్తున్నాయని సుప్రీం కోర్టు తెలిపింది.
వ్యాక్సినేషన్ డేటా సమర్పించండి..
2021-22 బడ్జెట్‌లో వ్యాక్సిన్ సేకరణకు 35వేల కోట్లు కేటాయించామన్న కేంద్రం వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ నిధులను ఇప్పటి వరకు ఎలా ఖర్చు చేశారో తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది. అంతే కాకుండా 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్సు వారికి వ్యాక్సినేషన్ కోసం ఈ నిదులను ఎందుకు వాడకూడదు అని ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఎంత శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారో పూర్తి డేటాను సమర్పించాలని కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది. దేశ జనాభాలో ఎంత శాతం మందికి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్(మొదటి, రెండో డోసులు కలిపి) చేశారనీ, ఎంత శాతం గ్రామీణ జనాభాకు ఈ వ్యాక్సిన్ వేశారో పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.
వ్యాక్సిన్ కొనుగోలు డేటాను సమర్పించండి..
కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీ లాంటి అన్ని కొవిడ్ వ్యాక్సిన్లను ఇప్పటి వరకు ఎన్ని కొనుగోలు చేశారు, వాటిని ఎప్పుడు, ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారన్న సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల మ్యూకోర్‌మైసిస్ లాంటి పోస్ట్ కొవిడ్ సమస్యలు పెరుగుతుండటంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మ్యూకోర్ మైసిస్ లాంటి జబ్బులను అరికట్టేందుకు, మందుల సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.