భారత్ రికార్డు.. 10 కోట్ల మందికి వ్యాక్సిన్

by vinod kumar |
భారత్ రికార్డు.. 10 కోట్ల మందికి వ్యాక్సిన్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. విడతల వారీగా వ్యాక్సిన్ అందిస్తుండగా.. తొలి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇచ్చారు. రెండో దశలో 60 సంవత్సరాలు పైబడిన వారితో పాటు 45 సంవత్సరాలు పైబడి ఏవైనా వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు.

ప్రస్తుతం మూడో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోంది. 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇలా విడతల వారీగా అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఏ రోజు ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారనే వివరాలను కేంద్రం ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంది.

ఈ క్రమంలో తాజాగా ఇప్పటివరకు 10 కోట్ల 15 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. వీరిలో 88 లక్షల మంది తొలి డోస్ తీసుకున్నారని, 12 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారని తెలిపింది. ఒక్క మహారాష్ట్రలోనే కోటి డోసులు పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది. 85 రోజుల్లో 10 కోట్ల మందికి ఏ దేశం వ్యాక్సిన్ అందించలేదు. దీంతో ఇది ఒక రికార్డు అని చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed