వారికి వ్యాక్సిన్ ఇవ్వండి.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
madrass-high-court 1
X

చెన్నై : మానసిక వికలాంగులకు నాలుగు వారాల్లోగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. గడువు ముగిసిన వారంలోగా దీనిపై స్టేటస్ రిపోర్టు తమకు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో మెంటల్ హెల్త్ పాలసీని సమర్థవంతగా అమలు చేయాలని కోరుతూ చెన్నైకు చెందిన చీర్ అనే ఎన్‌జీవో సంస్థ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్)ను దాఖలు చేసింది.

మానసిక రుగ్మతతో బాధపడుతూ నిరాశ్రయులుగా ఉన్నవారిని గుర్తించాలని, వారికి పునరావాసం కల్పించాలని, వ్యాక్సిన్ సహా ఇతర హెల్త్ కేర్ సౌకర్యాలు కల్పించాలని వ్యాజ్యంలో ఎన్‌జీవో కోరింది. ఈ పిల్‌పై చీఫ్ జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.

‘కరోనా పాండెమిక్ సమయంలో మానసిక వికలాంగులు పడుతున్న బాధలను ఈ పిల్ మా దృష్టికి తీసుకు వచ్చింది. మొబైల్ వ్యాక్సినేటింగ్ టీమ్‌లను ఉపయోగించి వికలాంగులకు వారి ఇంటి వద్దే వ్యాక్సిన్ ఇస్తున్నారు. మానసిక వికలాంగులకు వ్యాక్సినేట్ చేసేందుకు ఆ టీమ్‌లనే ఉపయోగించవచ్చు’అని ధర్మాసనం పేర్కొంది.

“మానసిక వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వడం, వారికి టీకాలు పంపిణీ చేసేలా చూసుకోవడం కోసం సమర్థవంతంగా ఏవిధంగానైనా స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించడం అత్యవసరం’ అని ధర్మాసనం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed