పదోన్నతులు కల్పించి.. పోస్టులు భర్తీ చేయండి : గోవింద్ నాయక్

by Shyam |
MBBS Doctors
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పని చేస్తున్న అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే కల్పించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్(టీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ధరావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ.. సుమారు సంవత్సరం కాలంగా డీహెచ్ పరిధిలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా, సీనియర్ అసిస్టెంట్లకు ఆఫీస్ సూపరింటెండెంట్లుగా, ఆఫీస్ సూపరింటెండెంట్ల నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా, ఏఓ నుండి ఏడీలుగా పదోన్నతులు కల్పించలేదన్నారు.

కొంత మంది తమ సొంత లాభాల కోసం అడ్డుపడుతుండటంతో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిందని, డీహెచ్ స్పందించి వెంటనే అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎనిమిది మెడికల్ కాలేజీల్లో పదోన్నతులు కల్పించిన వారికి పోస్టింగ్స్ ఇవ్వాలని సూచించారు. వైద్యారోగ్యశాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో పని చేస్తున్న వారిపై అదనపు పనిభారం పడుతోందని గోవింద్ నాయక్ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు .

Advertisement

Next Story