‘వైద్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి’

by Shyam |   ( Updated:2021-06-15 10:38:26.0  )
doctors protest
X

దిశ,ములుగు : వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నపోస్టులను వెంటనే శాశ్వత ప్రాతిపదికన పూర్తి చేయాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఐక్యవేదిక తరఫున ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ములుగు ఐక్యవేదిక తరపున ప్రభుత్వం ఉద్యోగస్తుల పై అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

ఈ సందర్భంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కొవిడ్ బారిన పడి చనిపోయిన వైద్య ఆరోగ్యశాఖ కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులందరికీ వ్యాక్సినేషన్ తప్పకుండా జరగాలని డిమాండ్ చేశారు.

పీఆర్సీ లో పునరాలోచన చేసి ఉద్యోగస్తులకు మెరుగైన పీఆర్సీ కల్పించాలని, కొవిడ్ డ్యూటీలో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగస్తులకు 20% ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లో ములుగు జిల్లా ఐక్య వేదిక ప్రతినిధులు సుధాకర్, పి రవీందర్, సాంబయ్య, మల్లయ్య, వినోదర్ నాగమణి, స్రవంతి, ప్రశాంతి, ఉష, లాల్నాయక్, అనిల్ కుమార్, మహాలక్ష్మి, కిరణ్, సాబీర్, ఎండి ఫజల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed