- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళ తలచుకుంటే ఏం చేయగలదో చూపిస్తా :వాణి కపూర్
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటి వాణికపూర్.. ‘బెల్ బాటమ్, చండీఘడ్ కరే ఆషికి, శంషెరా’ చిత్రాలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తన కెరియర్ గురించి మాట్లాడిన వాణి.. భవిష్యత్తులో తను చేయబోయే ప్రాజెక్ట్‌ల్లోని పాత్రలు మహిళను ఇండిపెండెన్స్‌కు సింబల్‌గా చూపించేలా ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపింది. ‘స్త్రీ ఎంత పవర్‌ఫుల్, తను తలచుకుంటే ఏం చేయగలదో చూపించాలని అనుకుంటున్నా. లింగ వివక్ష తగ్గించే సినిమాలు చేయాలని అకుంటున్నా’ అని చెప్పింది.
అదృష్టవశాత్తు స్త్రీని ఒక ఫ్లవర్ వాజ్‌గా చూసే తరంలో మనం లేమని.. తెరపై హీరోయిన్ అద్భుతంగా కనిపించాలి అనుకునే వారి కన్నా, తన నుంచి కొత్తదనం కోరుకునే యుగంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందంది. ఒక మహిళగా.. ఉమెన్ లైఫ్, డెసిషన్స్‌ను సెలబ్రేట్ చేసుకునే సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పింది. ‘గతంలోనూ తన చిన్న కెరియర్‌లో ‘శుద్ధ్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్’ లాంటి చిత్రాల్లో మహిళ గురించి అద్భుతమైన అంశాలను హైలెట్ చేయగలిగా. మహిళలు ఎంత స్ఫూర్తిగా, బలంగా ఉన్నారో ఈ సినిమాలు చూపించాయి. అలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా’ అని వాణి కపూర్ పేర్కొంది.