ఈ ఆనందం మాటల్లో వివరించలేను : వాణి కపూర్

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ దివా వాణి కపూర్ ఫుల్ హ్యాపీగా ఉంది. లాక్‌డౌన్‌లో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్‌’ మూవీతో పాటు ఆయిష్మాన్ ఖురానా సరసన ఓ లవ్ స్టోరీకి సైన్ చేసిన భామ.. ఐదు నెలల తర్వాత ‘బెల్ బాటమ్’ షూటింగ్‌కు హాజరు కాబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది. సినిమా సెట్స్‌పైకి వెళ్ళడంతో ముంబై నుంచి స్కాట్లాండ్ వెళ్ళిన వాణి.. చాలా రోజుల తర్వాత ఫ్లైట్ ఎక్కడాన్ని లక్కీగా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది. జీవితంలో మళ్లీ ఇవన్నీ చూస్తానని అనుకోలేదన్న ఆమె.. 2020 అందరికీ పరీక్షా సమయమని.. పరిస్థితులు నెమ్మదిగా ప్రారంభం అవుతున్నందుకు సంతోషిస్తున్నట్లు తెలిపింది. న్యూ నార్మల్‌కు అనుగుణంగా మారాలని.. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరింది.

అక్షయ్‌తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న వాణి కపూర్.. షూటింగ్ సమయం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. బెల్ బాటమ్ తనకు చాలా స్పెషల్ మూవీ కాబోతుందన్న ఆమె.. అక్షయ్ నుంచి చాలా నేర్చుకుంటానని అంటోంది. ‘అక్షయ్‌కు సినిమా పట్ల ఉన్న అంకితభావం, అభిరుచి మా అందరికీ స్ఫూర్తి.. సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ ప్రజలకు నచ్చేలా ఉంటుందని ఆశిస్తున్నా’ అని తెలిపింది.

Advertisement