పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. వధువుగా ఇంకెంత క్యూట్‌గా కనిపిస్తుందో..

by Dishafeatures3 |
పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్..  వధువుగా ఇంకెంత క్యూట్‌గా కనిపిస్తుందో..
X

దిశ, సినిమా : కోలీవుడ్ క్యూట్ బ్యూటీ మేఘా ఆకాశ్.. నితిన్ హీరోగా వచ్చిన ‘లై’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ కాలం కలిసి రాక ఈ మూవీ డిజాస్టర్ కావడం.. తర్వాత చాన్స్‌లు అందుకున్నా వర్కౌట్ కాకపోవడంతో అంతగా స్టార్‌డమ్ అందుకోలేకపోయింది. దీంతో చిన్న చిన్న సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మేఘ ప్రొఫెషనల్ వర్క్ కన్నా పర్సనల్ లైఫ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆమె పెళ్లిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్న నెటిజన్లు.. చాలా రూమర్స్ క్రియేట్ చేశారు, చేస్తున్నారు.

గతంలో ఓ రాజకీయ నాయకుడి కొడుకుతో ఏడడుగులు నడవబోతుందని వార్తలు వచ్చాయి. డేట్ కూడా కన్ఫర్మ్ అయిందన్నట్లు మేఘ మ్యారేజ్ టాపిక్ ట్రెండింగ్‌లోకి వచ్చింది కానీ అంతా ఫేక్ అని తేలిపోయింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతుందని మళ్లీ ప్రచారం జరుగుతుంది. మ్యారేజ్ వైబ్స్ అంటూ చేతికి మెహందీ, సంప్రదాయ చీర కట్టు, జ్యువెల్లరీతో నూతన వధువులాగా రెడీ అయిన ఫొటో షేర్ చేయడమే ఇందుకు కారణం. కానీ ఈ పిక్స్ అప్‌‌కమింగ్ యాడ్స్‌కు సంబంధించినవని క్లారిటీ వచ్చింది.



Next Story

Most Viewed