కరీంనగర్ లో పంచేది ఫోన్ ట్యాపింగ్ పైసలే!.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
కరీంనగర్ లో పంచేది ఫోన్ ట్యాపింగ్ పైసలే!.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు డబ్బును నమ్ముకున్నారని, కాంగ్రెస్ నాయకుల ఖాతాలు పరిశీలిస్తే కథలు మొత్తం బయటపడ్తాయని, ఈసీ తక్షణమే కాంగ్రెస్ నాయకుల ఖాతాలను పరిశీలించాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పైసలను నమ్ముకున్నారని, కరీంనగర్ లో ఖర్చు పెట్టే పైసలు ఫోన్ ట్యాపింగ్ లో బ్లాక్ మెయిల్ చేసి సంపాదించినవేనని అన్నారు. పోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు వియ్యంకుడని తెలిపారు.
అక్కడ ఆయన అమెరికాలో ఉండి డబ్బు పంపిస్తుంటే.. ఇక్కడ ఆయన వియ్యంకుడు డబ్బుతో ఓట్లు కొనే ప్రయత్నం చేస్తు్న్నాడని అన్నాడు. అదే డబ్బుతో కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులను కూడా కొంటున్నారని, ఒక్కో కార్పోరేటర్ అకౌంట్ లో 5 లక్షల రూపాయలు వేసి, చేతికి డైరెక్టుగా 15 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్ధి నామినేషన్ జరిగిన నాటినుండి కాంగ్రెస్ నాయకుల బ్యాంకు ఖాతాలు పరిశీలించాలని, ఎవరి ఖాతాలో పైసలు పడ్డాయో వారిపై సత్వరమే చర్యలు తీసుకొని కేసులు పెట్టాలని ఎన్నికల కమీషన్ ను విజ్ఞప్తి చేశారు. ప్రజలు గెలిపించింది సేవ చేయడానికి అని, ప్రజాసేవ పక్కకు పెట్టి అమ్ముడు పోడానికి కాదని మండిపడ్డారు. అలాగే ఎవరి అకౌంట్ లో 5 లక్షలు పడ్డాయో వారిపై విచారణ జరిపి, నోటీసులు ఇవ్వాలని కోరారు.

Next Story

Most Viewed