- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విరగ్గొడతాం.. జాగ్రత్త: మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్: ‘కొమ్ములు విరగ్గొడతాం.. జాగ్రత్త..’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెద్దిరెడ్డి ఆరాచకాలన్నీ లెక్కపెడుతున్నామని, ప్రతిదాన్ని సెటిల్ చేస్తామని ఆయన హెచ్చరించారు. చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ ప్రజాగళం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు భూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి దోపిడీలను ప్రశ్నించొద్దా.. చూస్తూ ఉరుకోవాలా అని ప్రశ్నించారు. అంగళ్లులో టీడీపీ నేతలపై జరిగిన దాడి ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అంగళ్లు వస్తూనే ఉంటామని, అడ్డొస్తే సైకిల్‌తో తొక్కేస్తామంటూ హెచ్చరించారు. అంగళ్లు ఘటనలో తనతో పాటు 600 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపాల రెడ్డిని ప్రజలు వదిలిపెట్టరని.. హుందాతనమేంటో పెద్దిరెడ్డి నేర్చుకోవాలని చంద్రబాబు సూచించారు. పెద్దిరెడ్డి చేసేది ఇసుక, మైనింగ్ మాఫియా, ఎర్రచందనం అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకుంటారని, పేదల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి అనకొండలా మారి కొండలను మింగేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.