- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పలుచోట్ల ఆదివారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. నిన్నటి వరకు ఎండలు మండి పోగా.. నేడు కాస్త చినుకులు కురవడంతో రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణం కూల్ అయ్యింది. దీంతో ప్రజలు ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించినట్లయింది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. వరంగల్ జిల్లాలో ఒక్కసారి వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ఖమ్మంలో ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది. నల్గొండ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో రైతు బాస బుల్లయ్య (46), జనగామ జిల్లా రఘునాథపల్లిలో రైతు దాసరి అజయ్(39) పిడుగు పాటుకు మృతి చెందారు. అలాగే ములుగు జిల్లా ఏటూరునాగారంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.