- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్మికులు చనిపోతే మంత్రులు పరామర్శించరా?
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ఓసీపీ-1లో పేలుడు కారణంగా చనిపోయిన నలుగురు కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను టీఆర్ఎస్ మంత్రులు ఎందుకు పరామర్శించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్ పాలిమార్ గ్యాస్ ఘటనలో పరిహారం ఇచ్చినట్టుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఓసీపీ బాధిత కుటుంబాలకు రూ.కోటి ఇస్తారని ఆశించామన్నారు. రాష్ట్రంలో వివక్షకు గురవుతున్న ప్రాజెక్టుల సందర్శన కోసం కాంగ్రెస్ నాయకులు వెళితే సీఎం తమపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. అలాగే మంథనిలో ఇటీవల పోలీసుల వేధింపులకు గురై దళిత వ్యక్తి రంగయ్య లాకప్ డెత్‌పై సీబీఐ విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సరికాదని వ్యాఖ్యానించారు. వీహెచ్ వెంట మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్, ఎమ్మెల్సీ రాములు నాయక్, మక్కాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.