- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకోం : వీహెచ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను బొంద పెడతాడా, కాళ్లకింద నలిపేస్తా అంటూ ఒక సీఎం హోదాలో ఉండి మాట్లాడడం సరికదాన్నారు. కేసీఆర్ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉపఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వరాలు ప్రకటిస్తున్నాడని, మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం మెడలు వంచుతా అని చెప్పిన సీఎం కేసీఆరే మెడలు వంచుకుని వచ్చాడని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీలో మేయర్ లేదా డిప్యూటీ మేయర్ మైనార్టీలకు ఇచ్చేవారని, ఇప్పుడు దాన్ని సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని మండిపడ్డారు.
మళ్లీ మోసానికి కుట్ర : రాములు నాయక్
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉండడంతో నల్గొండ, నాగార్జున సాగర్ ప్రజలకు మళ్లీ మోసం చేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలోనే ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రారంభించిందని, జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే చాలా లిఫ్ట్లు ప్రారంభించారన్నారు. ఏడేళ్లు నిద్రపోయిన సీఎం ఇప్పుడు మాట్లాడుతున్నాడని, గ్రావిటీ ద్వారా పారే నీళ్లకు ఎత్తిపోతలు నిర్మిస్తున్నారని, అలాగైతేనే సీఎంకు కమీషన్లు వస్తాయని విమర్శించారు. గిరిజనుల గురించి కుక్కలంటూ మాట్లాడారని, కేసీఆర్కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రాములు నాయక్ అన్నారు.