- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శానిటైజింగ్ పరికరం తయారు చేసిన డీఆర్డీవో
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌తో అధికంగా ప్రభావితమైన చోట్లను శానిటైజ్ చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఒక పరికరాన్ని తయారుచేసింది. అల్ట్రావయొలెట్ డిస్‌ఇన్ఫెక్షన్ టవర్ అని పిలిచే ఈ పరికరంతో హైటెక్ ఉపరితలాలైన ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్లు, గ్యాడ్జెట్లు, పరిశోధన కేంద్రాల్లో వాడే ఎక్విప్‌మెంట్లు ఉన్న గదులను శుభ్రం చేయవచ్చు. దీనిలో ఉన్న అల్ట్రా వయొలెట్ బ్లాస్టర్ సాయంతో జనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలైన విమానాశ్రయాలు, మెట్రోస్టేషన్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లను కూడా శానిటైజ్ చేయవచ్చని డీఆర్డీవో తెలిపింది.
ఈ పరికరంలో 43 వాట్ల యూవీసీ సామర్థ్యంగల ఆరు లైట్లు ఉన్నాయి. 360 డిగ్రీల ఇల్యుమినేషన్ కోసం ఇవి ఒక్కొక్కటి 254 నానో మీటర్ల తరంగదైర్ఘ్యం కలిగి ఉన్నాయి. 12×12 అడుగుల వైశాల్యం గల గదిలో ఈ టవర్‌ని పది నిమిషాలు ఉంచితే గది మొత్తం శానిటైజ్ అవుతుంది. అయితే ఆ పది నిమిషాల్లో నాలుగు నుంచి ఐదు సార్లు లైటు స్థానాన్ని మార్చాల్సి ఉంటుంది. డీఆర్డీవో వారి ప్రీమియర్ ల్యాబ్ లేసర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌లో దీన్ని తయారు చేశారు.
Tags: corona, covid, sanitizer, UV, DRDO, Gadgets, UVC, Premier lab, Lazer blaster