పేపర్ రీసైక్లింగ్‌తో ‘ఎలక్ట్రిక్ రేసింగ్ కార్’

by Shyam |
Recycled Paper
X

దిశ, ఫీచర్స్ : రేసింగ్‌లో పాల్గొనేవారు కార్బన్ ఫైబర్ బాడీతో స్ట్రాంగ్‌గా ఉండే రేసింగ్ కార్లను ఇష్టపడుతుంటారు. ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు అన్ని రకాల సేఫ్టీ మెజర్స్‌ పాటిస్తూ రూపొందించే ఈ కార్లను సాధారణ యువత కొనే అవకాశాలు తక్కువే. ఈ నేపథ్యంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ ప్లస్ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కారు రూపొందించారు ఉత్తరాఖండ్ స్టూడెంట్స్.

ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ గ్రాఫిక్ ఎరా కాలేజ్‌కు చెందిన విద్యార్థులు వినూత్న రేసింగ్ కారును తయారుచేశారు. ఒక్కరు మాత్రమే కూర్చునే వీలుండే ఈ ఎలక్ట్రిక్ సింగిల్-సీటర్ రేసింగ్ కార్‌ను రీసైకిల్డ్ పేపర్‌తో తయారు చేయడం విశేషం. ఈ ప్రాజెక్టు కోసం కాలేజీ ప్రెమిసెస్‌తో పాటు చుట్టుపక్కల ప్రదేశాల నుంచి పేపర్‌ను కలెక్ట్ చేసిన విద్యార్థులు.. పేపర్ ఇంజినీరింగ్ ప్రిన్సిపుల్స్‌తో రీసైకిల్ చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్చర్ ద్వారా వాటర్, ఫైర్ ప్రూఫ్ కారును రూపొందించారు. దీని బరువు 40 కేజీలు మాత్రమే. ఈ వెహికల్‌కు ‘సీ-జీరో(C-Zero)’ అని నామకరణం చేశారు. సాధారణంగా కార్బన్ ఫైబర్ కారు ధర రూ.3 లక్షలుండగా, ఈ వెహికల్ ధర 1.78 లక్షలు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది.

‘సీ-జీరో’ వెహికల్ సక్సెస్ కావడం పట్ల స్టూడెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీలో చాలాసార్లు ఫెయిల్ అయ్యామని, చివరకు సక్సెస్ బాటలోకి వచ్చామని పది మంది విద్యార్థులు తెలిపారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని తయారైన సీ-జీరో వెహికల్ సక్సెస్ అయిందని, ట్రాక్‌‌పై 108 km/kWh మైలేజ్‌ ఇచ్చిందని వివరించారు. కాగా ఈ వినూత్న ఆవిష్కరణ చేసిన విద్యార్థులకు ‘సర్కులర్ ఎకానమీ’ అవార్డు వరించింది. ప్రస్తుతం ఈ రేసింగ్ కారు 600 km/kWh పయనించేలా వర్క్ చేస్తున్నట్లు స్టూడెంట్స్ చెప్తున్నారు.

Advertisement

Next Story