ఎమ్మెల్యేల జీతాల్లో 30 శాతం కోత

by Anukaran |   ( Updated:2020-08-14 03:57:11.0  )
ఎమ్మెల్యేల జీతాల్లో 30 శాతం కోత
X

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎమ్మెల్యేలందరూ కరోనాను ఎదుర్కోవడానికి తమ వేతనాల్లో 30శాతం కోతపడనుంది. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ప్రతి ఎమ్మెల్యే తమ వేతనం, అలవెన్సులలో 30శాతం మొత్తాన్ని కరోనాపై పోరాటానికి వెచ్చించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి అంటే 2021 మార్చి వరకు ఈ నిబంధన వర్తిస్తుందని క్యాబినెట్ మంత్రి మదన్ కౌశిక్ వెల్లడించారు.

ఏప్రిల్‌లోనే రాష్ట్ర క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అధికారపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు 30శాతం జీతాన్ని కేటాయించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేయడంతో తాజా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఎమ్మెల్యేల మూల వేతనం సుమారు రూ. 30వేలుగా ఉండగా అలవెన్సులన్నీ కలిపితే రూ. 2.04లక్షలకు చేరువగా ఉన్నాయి. కానీ, అధికార పక్ష బీజేపీ ఎమ్మెల్యేలు కేవలం బేసిక్ సాలరీలోని 30శాతం కేటాయిస్తుండటంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. తాజా, ఆర్డినెన్స్‌తో ప్రతి ఎమ్మెల్యే సుమారు రూ. 57వేల వరకు కరోనా కోసం కేటాయించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed