- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వీయ నియంత్రణ పాటించాలి -ఉత్తమ్ కుమార్‌రెడ్డి
దిశ,న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్‌ను అరికట్టడానికి ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఫేస్‌బక్ లైవ్‌లో మాట్లాడుతూ.. కరోనా రూపంలో ప్రపంచం విపత్తును ఎదుర్కొంటుందన్నారు. వైరస్ మానవ జాతిని ఆందోళనకర పరిస్థితిలోకి నెట్టివేసిందన్నారు. చైనాలో మొదలైన కరోనా వైరస్ నేడు అగ్ర రాజ్యమైన అమెరికాను గడగడ వణికిస్తుందన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిబంధనలను అందరూ పాటించాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో ప్రజలకు కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యం రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. నిత్యవసర వస్తువులు కొరత రాకుండా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసిన డబ్బులు చెల్లించాలన్నారు.
tags: Uttam Kumar Reddy ,United States ,White ration card , farmers