- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్యాకేజీతో నిరాశ: ఉత్తమ్ కుమార్
దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నిరుపేద ప్రజలను నిరుత్సాహ పరిచేలా ఉందని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ పేదలను, ఉద్యోగులను ఆదుకునేలా లేదంటూ మండిపడ్డారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు జీఎస్టీ, రుణాల ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడుతో అన్యాయం
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ నీళ్ల వాటా కాపాడాలని సీఎం కేసీఆర్‌ని కోరినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. నీళ్ల సెంటిమెంట్‌తో ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన కేసీఆర్ ఆరేండ్ల పాలనలో విఫలమయ్యారంటూ ఆగ్రహించారు. శ్రీశైలం నుంచి ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం మళ్లించుకపోవడానికి సిద్ధమైందన్నారు. ఏపీ సీఎం జగన్‌తో మంచి సంబంధాలున్నా కేసీఆర్ పోతిరెడ్డిపాడు విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అసమర్థతతో వ్యవహరిస్తున్నారా… లేక ఏపీతో కుమ్మక్కయ్యారా..? అని ఎద్దేవా చేశారు.
తుమ్మడిహెట్టి ద్వారా కమీషన్లు రావాని తెలిసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. లాక్‌డౌన్‌లో ఎవరు బయటకు వెళ్లొద్దని చెప్పిన కేసీఆర్ రూ.24 వేల కోట్లు టెండర్లు వేశారని, ఒక పక్కన కరోనా వైరస్‌తో రాష్ట్రం అల్లాడిపోతుంటే ఎలా టెండర్లు వేశారని ఉత్తమ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బంధువులకే రూ. 6 వేల కోట్ల పని అప్పగించారని, కేసీఆర్ సొంత లాభం కోసం 30 నుంచి 40 శాతం టెండర్లు పెంచారని ఆయన ఆరోపించారు.