- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేతనాల్లో కోతలు విధించొద్దు : ఉత్తమ్
దిశ, న్యూస్‌బ్యూరో :
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారత్ యుద్ధంలో పాల్లొన్నప్పుడు కూడా ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు తగ్గించలేదని, అలాంటిది వారం రోజుల లాక్‌డౌన్‌తోనే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోతపెట్టడం ఎంత వరకు సమంజసమో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. బుధవారం గాంధీ భవనలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌కు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నాలుగో తరగతి ఉద్యోగుల, పెన్షన్ దారుల వేతనాల్లో కోతలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతపై పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతూనే.. మళ్ళీ రూ. 24 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలవడం ఎలా సాధ్యమైందన్నారు. ఒక పక్క ప్రజలు అల్లాడిపోతుంటే.. మీ కమీషన్ల కోసం టెండర్లు పిలుస్తారా అని ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు, బియ్యం కేంద్రంతో కలిపి ఇస్తున్నారా లేక సెపరేట్‌గా ప్రస్తుతం ఇస్తున్న 6 కిలోలకు మరో 6 కిలోలు కలిపి ఇస్తున్నారా.. స్పష్టతనివ్వాలని కోరారు. కొన్ని జిల్లాల్లో మినరల్ నిధులు ఉన్నాయని, అవి హెల్త్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలని సూచించారు.
Tags: Uttam Kumar Reddy, TPCC, Salaries reduction, WhiteRation cards