హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ జన్మదిన వేడుకలు

by Shyam |   ( Updated:2020-06-20 02:35:17.0  )
హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ జన్మదిన వేడుకలు
X

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ ప్రెసిడెంట్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రేస్ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా స్థానిక సాయిబాబా ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపాల్టీలో పరిశుద్ధ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజక వర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఉత్తమ్ ను హుజూర్ నగర్ నియోజక వర్గం ప్రజలు ఎప్పడు మరవరన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రేస్ పోరాటం చేస్తుందన్నారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చూసించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రెసిడెంట్ మల్లుఖార్జున్,సాముల శివారెడ్డి, యరగాని నాగన్న గౌడ్,అరుణ్ కుమార్ దేశముఖ్, గల్లా వెంకటేశ్వర్లు, సుతారి వేణు అజీష్ పాషా,మున్సిపాల్టీ కౌన్సిలర్లు శ్రావణ్ కుమార్,రాం గోపి,కారింగుల విజయ వెంకటేశ్వర్లు,వీరారెడ్డి,రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story