Nag Mark 2: భారత అమ్ముల పొదిలో మరో పవర్ ఫుల్ మిసైల్

by Shamantha N |
Nag Mark 2: భారత అమ్ముల పొదిలో మరో పవర్ ఫుల్ మిసైల్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అమ్ముల పొదిలో మరో పవర్ ఫుల్ మిసైల్ వచ్చి చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ట్యాంక్‌ విధ్వంసక గైడెడ్‌ క్షిపణి నాగ్‌ మార్క్‌-2(Nag MK-2) పరీక్ష విజయవంతమైంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో సోమవారం పరీక్షను నిర్వహించారు. మూడో తరానికి చెందిన ఫైర్‌ అండ్‌ ఫొర్గెట్‌ క్షిపణి (Missile)అయిన నాగ్‌మార్క్‌-2 అనుకున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని భారత రక్షణ పరిశోధన సంస్థ(DRDO) ప్రకటించింది. మొత్తం మూడుసార్లు ఈ క్షిపణిని ప్రయోగించగా... అన్నిసార్లు కచ్చితత్వమైన టార్గెట్‌ను చేరుకుందని పేర్కొంది. గరిష్ఠ, కనిష్ఠ లక్ష్యాలను(Targets) ఛేదించడంతో దీని పరిధిని సైతం నిర్థరించినట్లు వెల్లడించింది. నాగ్‌ క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్‌-2 కూడా పరీక్షించినట్లు పేర్కొంది. పూర్తిస్థాయిలో పరీక్షలన్నీ విజయవంతంమవ్వడంతో నాగ్‌ ఆయుధ వ్యవస్థ మొత్తం... భారత సైన్యం(Indian Army)లో ప్రవేశించేందుకు సిద్ధమైంది. నాగ్‌మార్క్‌-2 పరీక్ష విజయవంతంతో ప్రపంచం ఎదుట మరోసారి భారత్‌ సత్తా చాటామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ (Rajnath Singh)అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న సిబ్బందితో పాటు DRDO, భారత సైన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story