- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Big Shock: పెళ్లైన నాలుగు రోజులకే వరుడు జంప్

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి చేసుకుని తోడుగా ఉంటాడనున్న భర్త నాలుగు రోజులకే జంప్ అయ్యారు. దీంతో భార్య లబోదిబో మంటున్నారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. విరుద్ నగర్ సమీపం మీసలూర్ గ్రామానికి చెందిన ప్రణీత్ కుమార్, దివ్యలు రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. అయినా సరే వారిని కాదని ఈ నెల 10న వివాహం చేసుకున్నారు. స్నేహితులే దగ్గరుండి వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా నాలుగు రోజులకే నవ వధువుకు వరుడు బిగ్ షాక్ ఇచ్చారు. స్నేహితుల వద్దకు వెళ్లొస్తానని చెప్పి ఇంటికి తిరిగిరాలేదు. ఎంత చూసినా, వెతికినా రాకపోవడంతో బాధితురాలు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తన భర్త ఆచూకీ గుర్తించాలని ఫిర్యాదు చేశారు. అయితే భర్త ప్రణీత్ కుటుంబంతో సహా పారిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త ప్రణీత్ కుమార్ కోసం గాలిస్తున్నారు.