- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

దిశ, వెబ్‌డెస్క్: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) వర్ధంతి సందర్భంగా నటులు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) హైదారాబాద్ (Hyderabad)లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna), రామకృష్ణ (Rama Krishna)లు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి నటుడిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ (NTR) ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.
మరికొద్దిసేపట్లోనే ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కూడా ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్దకు వెళ్లి నివాళులర్పించనున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ (NTR Trust Bhavan)లో నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం ఆసుపత్రిలో ఆయన ఎన్టీఆర్‌కు నివాళులర్పించనున్నారు.