- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vishal: ఇండస్ట్రీలోనే ఇదో రికార్డు.. వారందరికీ థ్యాంక్స్.. విశాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) నటించిన ‘మద గజ రాజా’(Mada gajaraja) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రం దాదాపు 12 ఏళ్ల తర్వాత విడుదల అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఈ మూవీ టీమ్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ విశాల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. “సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను చూస్తూ థియేటర్లలో వారు ఎంజాయ్ చేయడం చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
ఏదో ఒక రోజు మన సినిమా రిలీజ్ అయి వండర్స్ క్రియేట్ చేస్తుందంటూ 12 ఏళ్లుగా నాకు ధైర్యాన్ని ఇచ్చిన సుందర్ సార్‌కు థ్యాంక్స్. అలాగే మన జీవితంలో చోటు చేసుకునే వాటన్నింటికీ కారణం ఉంటుందని నేను నమ్ముతా. ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు ప్రతి రోజూ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రశంసలు దక్కుతున్నాయి. ‘మై డియర్ లవరూ’ సాంగ్ ఇంతగా ఆదరణ దక్కుతుందని నేను ఊహించలేదు. చెన్నైలో శనివారం నిర్వహించనున్న విజయ్ ఆంటోని లైవ్ కాన్సర్ట్‌లో నేను ఆ సాంగ్ పాడబోతున్నా” అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా డైరెక్టర్ సుందర్ సి(Sunder) తెరకెక్కించిన ఈ సినిమాలో విశాల్‌కి జంటగా అంజలీ(Anjali), వరలక్ష్మి శరత్ కుమార్(VaralaXmi Sharath Kumar) హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ నటుడు ఆర్య(Arya) గెస్ట్ రోల్‌లో నటించగా.. రియల్ హీరో సోనూసూద్(Sonu Sood), సంతానం(Santhanam) కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమాకి విజయ్ ఆంటోని(Vijay Antony) సంగీతం అందించారు.