రంజాన్ స్పెషల్ నోరూరించే టేస్టీ టేస్టీ షీర్ ఖుర్మా తయారీ విధానం..!

by Anjali |
రంజాన్ స్పెషల్ నోరూరించే టేస్టీ టేస్టీ షీర్ ఖుర్మా తయారీ విధానం..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి రంజాన్. రంజాన్ మాసం ఇంకో మూడ్రోజుల్లో ముగియనుంది. ఈ నెల (మార్చి) 31 లేదా ఏప్రిల్ 1న రంజాన్ పండగను జరుపుకోనేందు ముస్లింలు సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే రంజాన్ ఇఫ్తార్ విందుల్లో లేదా రంజాన్ పండుగ టైంలో స్పెషల్ షీర్ ఖుర్మా చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఒక మాటలో చెప్పాలంటే షీర్ ఖుర్మా లేని పండుగ అసంపూర్తిగా ఉంటుంది. ఇక ఈద్-ఉల్-ఫితర్ రోజు స్పెషల్‌గా పాలు, సేమియా, ఖర్జూరాలతో పాటు మిగతా డ్రై ఫ్రూట్స్‌తో చేసుకునే కమ్మటి స్వీట్ షీర్ ఖుర్మా. దీనిని ఎంతో టేస్టీగా.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు..

ఒక కప్పు సన్నని వర్మిసెల్లి (సేమియా) ,లీటరు ఫుల్ క్రీమ్ పాలు, 45 టీస్పూన్ల చక్కెర (రుచికి తగ్గట్టుగా), 10 నుంచి 12 జీడిపప్పు (సన్నగా తరిగినవి), 10 నుంచి 12 బాదం పప్పులు (సన్నగా తరిగినవి), 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 56 ఖర్జూరాలు (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి), 10 నుంచి 12 పిస్తాపప్పులు (సన్నగా తరిగినవి), కుంకుమ పువ్వు, 1 స్పూన్ ఏలకుల పొడి తీసుకోవాలి.

షీర్ ఖుర్మా తయారు చేసే విధానం..

ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని.. అందులో పాలు పోసి మీడియం మంట మీద మరిగించాలి. తర్వాత పాలు అడుగున అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. పాలు మరిగాక.. మంటను తగ్గించి పదిహేను నిమిషాలు ఉడికించాలి. అలాగే వేరే పాన్ లో నెయ్యి వేడి చేయాలి. తర్వాత సేమ్యా వేసి లేత బంగారు కలర్ వచ్చేంతవరకు వేయించాలి. దీన్ని మరిగే పాలలో వేసి.. వర్మిసెల్లి వేసి బాగా కలపాక.. ఇది మెత్తబడే వరకు 40 నిమిషాలు ఉడికించాలి.

తర్వాత చక్కెర వేసి బాగా కలపాక.. తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా, ఖర్జూరం వేయండి. మరింత రుచి కోసం ఏలకుల పొడి, కుంకుమపువ్వును యాడ్ చేయండి. షీర్ ఖుర్మాను మరో ఇరవై నిమిషాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story

Most Viewed