అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులు అరెస్ట్

by Sridhar Babu |   ( Updated:2025-01-14 10:08:41.0  )
అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులు అరెస్ట్
X

దిశ, చేగుంట : మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలిస్తున్నట్లు రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను తెలియజేశారు. ఈనెల 8వ తేదీన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ హంస ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కనగల అంబేద్కర్ విగ్రహం వెనకాల మతిస్థిమితం లేని ఒక మహిళ మీద ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు రాగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించినట్లు తెలిపారు.

రామంతపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి సంబంధించి బర్రె కనపడకపోవడంతో ఫిర్యాదు రాగా హంస ఫ్యామిలీ రెస్టారెంట్ లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా ఈ దారుణం బయటపడినట్లు తెలిపారు. చేగుంట మండల కేంద్రం నుండి కోళ్లను సప్లై చేసే వాహనం మీద పనిచేసే డ్రైవర్ , హెల్పర్లు ఈ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టినట్టు గుర్తించి ఈనెల 13వ తేదీన అరెస్టు చేసినట్లు తెలిపారు. సామూహిక అత్యాచార నిందితులైన తూప్రాన్ పట్టణానికి చెందిన సయ్యద్ అఫ్రోజ్, చేగుంట పట్టణానికి చెందిన గౌర బసవరాజ్, బీహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ సాహిల్ లను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం మెదక్ కోర్టుకు తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ తో పాటు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed