Oscar: వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్.. ఆస్కార్ అనౌన్స్మెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

by Mahesh |   ( Updated:2025-01-14 12:14:26.0  )
Oscar: వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్.. ఆస్కార్ అనౌన్స్మెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
X

దిశ వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా(America)లోని లాస్ ఏంజిల్స్‌(Los Angeles)ని వైల్డ్ ఫైర్(Wildfire)దహించి వేస్తుంది. జనవరి 6న మొదలైన కార్చిచ్చు.. కాస్త హాలీవుడ్ నగరం(Hollywood city) ప్రాంతాన్ని కమ్మేశాయి. దీంతో గత వారం రోజులుగా ఆ ప్రాంతం మొత్తం మంటల్లో కాలి పోతుంది. ఈ నేపథ్యంలో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ & సైన్స్ 2025 ఆస్కార్(Oscar)కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేల17న ప్రకటించాల్సిన 2025 ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ మరో మూడు రోజుల్లో వెలువడాల్సిన ఆస్కార్ నామినేషన్ ప్రకటన(Oscar nomination announcement) వాయిదా పడింది. ఈ ప్రకటనను జనవరి 23న ప్రకటిస్తామని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ & సైన్సెస్(Oscar) తెలిపింది. కాగా అదే రోజున వర్చువల్ గా నామినీల లిస్టును ప్రకటిస్తారు. మార్చి 2న అన్నికేటాగిరిల్లోని విజేతలుగా నిలిచిన సినిమాలకు ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అనౌన్స్ చేయనున్నారు. కాగా లాస్ ఎంజిల్స్(Los Angeles) లో కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ నగరంతో పాటు.. ఆస్కార్ అవార్డుల కోసం వేసిన సెట్ కూడా పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story