Ntr Varthanti: యుగపురుషుడుకి ఘన నివాళి

by srinivas |   ( Updated:2025-01-18 04:34:29.0  )
Ntr Varthanti: యుగపురుషుడుకి ఘన నివాళి
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత సీఎం, యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, అన్న నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) 29వ వర్థంతి సందర్బంగా మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ట్వీట్ చేశారు.


‘‘తాత నందమూరి తారకరావుకు ఘన నివాళి అర్పిస్తున్నా. ఎన్టీఆర్(Ntr) అనేది ఒక పేరు కాదు.. ప్రభంజనం. అదొక సంచలనం. తెలుగువాడి విశ్వరూపం. వెండితెరపై రారాజుగా వెలుగొందారు, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) నిర్మితమైంది. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లని నినదించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మా తాతే నాకు నిత్యస్ఫూర్తి..’’ అని లోకేశ్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed