ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు… ఉచిత గాలిపటాల పంపిణీ

by Kalyani |
ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు… ఉచిత గాలిపటాల  పంపిణీ
X

దిశ, ఇల్లందు : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇల్లందు వాసవి క్లబ్, ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులకు ఉచిత గాలిపటాలను పంపిణీ చేశారు. వాసవి క్లబ్, ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ఉదయం 7 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో మహిళా శానిటేషన్ సిబ్బంది వేసిన ముగ్గులను పరిశీలించి ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. అనంతరం గోవింద్ సెంటర్, బుగ్గ వాగు బ్రిడ్జి సెంటర్, ఆమ్ బజార్, మెయిన్ రోడ్డు మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ వరకు వెళ్లి మహిళలు తమ ఇంటి ముంగిళ్ళలో వేసినటువంటి ముగ్గులను పరిశీలించి అందంగా తమ ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దిన 20 మంది మహిళలకు వివిధ రకాలైన ఆకర్షణీయమైన బహుమతులను అందించారు.

అదేవిధంగా మెయిన్ రోడ్ సెంటర్ లో కటకం సెలక్షన్స్ వస్త్ర దుకాణం ముందు చిన్నారులకు ఉచితంగా గాలిపటాలు , ధారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నూతన అధ్యక్షులు బోనగిరి రవి కిరణ్, ప్రధాన కార్యదర్శి కటకం సత్యేంద్ర కుమార్, కోశాధికారి తీర్థాల నాగరాజు, జిల్లా, మండల, పట్టణ, యువజన ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు, వాసవి క్లబ్ సభ్యులు ఎలుగూరి నగేష్ కుమార్, పల్లెర్ల చంద్రశేఖర్, ప్రొద్దుటూరు నాగేశ్వరరావు, అర్వపల్లి రాధాకృష్ణ, అనుబాబు, తాటిపల్లి సుబ్బారావు, ఎలుగూరి మధుబాబు, పుల్లూరు సతీష్ కుమార్, సైఫా రాజశేఖర్, పసుమర్తి వాసు, జొన్నల ఉపేంద్రనాథ్, గందే సురేష్, ఓరుగంటి పవన్ కుమార్, కటకం సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story