- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాచకొండ పరిధిలో గన్స్ కలకలం...?
దిశ, సిటీ క్రైమ్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా నుంచి 2 కు పైగా తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 బుల్లెట్ లను కూడా రికవరీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ తుపాకులను ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్ కు తీసుకువచ్చి వాటిని విక్రయించాలనే ప్రయత్నంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందడంతో కొందరు దొరికారు. కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ను తుపాకుల కోసం నగరంలో ఎవరైనా సంప్రదించారా అనే కోణంలో పోలీసులు రహస్యంగా దర్యాప్తును చేస్తున్నారు. ఈ తుపాకులను తీసుకువచ్చి వాటిని శివారు ప్రాంతాల్లో ఏమైనా పరీక్షించారా అనే విషయం పై కూడా ఆరా తీస్తున్నారు.
ఈ తుపాకుల ముఠా లో బీహార్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాల కు చెందిన వారు ఉన్నారని తెలిసింది. వారికి తెలిసిన వారు నగరంలో ఉండడంతో వారి ద్వారా తుపాకుల ను ఈజీగా విక్రయించొచ్చనే ఆలోచనతో ఈ ముఠా తమ వద్ద గన్స్ ఉన్నాయని ప్రచారం చేసుకున్నట్లు వెల్లడవుతుంది. ఈ ముఠా గతంలో ఎవరికైనా, ఎక్కడెక్కడ తుపాకులను విక్రయించారనే విషయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. బుధ, గురువారాల్లో ఈ ముఠా పై పోలీసులు అధికారికంగా వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కరుడుగట్టిన ఈ ముఠాను పట్టుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్పష్టమవుతుంది. గత ఏడాదిలో నేరేడ్ మెట్ పోలీసులు కూడా తుపాకులను విక్రయించే ఓ ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ ముఠాకు తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ముఠాకు ఏమైనా లింక్ ఉందా అనే విషయాలు బయట పడాల్సి ఉంది.