కోమటిరెడ్డికి ఉత్తమ్ ఆల్ ది బెస్ట్

by Shyam |   ( Updated:2020-12-09 11:44:48.0  )
కోమటిరెడ్డికి ఉత్తమ్ ఆల్ ది బెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ పీసీసీకి రాజీనామా చేశానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అవసరం ఉందని తెలిపారు. పీసీసీ కసరత్తును పూర్తి చేసేందుకు మాణిక్కం ఠాకూర్ వచ్చారని చెప్పారు. నేతల అభిప్రాయం తీసుకుని సోనియా గాంధీకి ఠాకూర్ నివేదిక ఇస్తారని పేర్కొన్నారు. సోనియా గాంధీ అభిప్రాయమే తన అభిప్రాయమని ఉత్తమ్ అన్నారు. సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు. చివరగా కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. కాబోయే తెలంగాణ పీసీసీ చీఫ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనే సంకేతాలను ఉత్తమ్ పరోక్షంగా ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story