దేశంలో వారిద్దరు అత్యంత అవినీతి పరులు

by Anukaran |   ( Updated:2020-10-31 11:23:27.0  )
దేశంలో వారిద్దరు అత్యంత అవినీతి పరులు
X

దిశ, సిద్దిపేట:
స్వతంత్ర భారత దేశంలో అత్యంత అవినీతి పరులు సీఎం కేసీఆర్ , మంత్రి హరీశ్ రావులే అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వారు దోచుక తింటున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులు కట్టేది జనం కోసం కాదనీ జేబులు నింపుకోవడానికేనని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కిసాన్ అధికార్ దివాస్ సత్యాగ్రహ ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హనుమంత రావు, జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి లు పాల్గొన్నారు. ఇందిరా, పటేల్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ఇందిరా గాంధీని సొంత బాడీ గార్డ్ లు హత్య చేశారని తెలిపారు. భారత దేశ సమగ్రత, సమైక్యతను కాపాడడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ చేసినపుడు తాను కూడా సైన్యంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక సేవలు అందించారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు చేస్తు, వ్యవసాయాన్ని ఆదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం మోడీ చేస్తున్నారని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed